*మణిపూసలు*;-*పోతుల చైతన్య భారతి* 7013264464
సన్నగిల్లె బంధాలు
మానవ అనుబంధాలు
సరికొత్త కాంతులతో
నింపాలి సుగంధాలు.

కారు చీకటి అలుముకొని
ఆత్మీయతలు దెబ్బతిని
స్వార్థo పెరిగిపోయి
పెoచుకునెనూ అశాంతిని.

దీపాలను వెలిగించు
అజ్ఞానం తొలగించు
పావన చరితుడవై
సుఖశాంతుల జీవించు.

సేవాభావం నిండిన
సద్భావనలే నుండిన
దేదీప్యమై వెలుగొందు.
సద్గ్రంథ పఠనముండిన.



కామెంట్‌లు