ఇంజక్షన్...
కొందరికి భయం
ఎన్నోజీవుల కభయం!
క్రిములతో తిరుగబడి
ధీరోధాత్తునిలా పోరాడి
రోగమూలాలు ఛేదించే
సూదిమందు సేవ అమూల్యం!
కాల నాగుల విషం
దహించే గరళ కంఠునిలా
రోగి సంపూర్ణ స్వస్థతకు
సూదిమందు త్యాగం అమోఘం!
టూల్డౌన్-పెన్ డౌన్
సమ్మెసైరన్ మోగినా
శస్త్రచికిత్స సారధి
నిష్క్రియమైతే ప్రాణాంతకం!
పసి పిల్లాడు టీకా మందుతో
రోగనివారణం
పండు ముసలి సూది మందుతో
పరమానంద భరితం!
సకల జంతు జాతుల
వ్యాధుల క్షిణింపజేస్తూ
వయస్సుకు తగు మోతాదు
గణించే నిబద్దత సూదిది!
ఎవరి సూది వారికే
రుగ్మతలు వేరైనా
చికిత్సలో తేడాలైనా
భిన్నత్వంలో ఏకత్వం
ఇంజక్షన్ ఏకైక లక్ష్యం!
ఖరీదెంతైనా
ప్రాణాధారమే ప్రధానం
సూది మందైనా!గోళి మందైనా!!
ఔషధ నాణ్యత నకిలీ నాసిరకమైతే
అందరి ఆరోగ్యం గాలిలో దీపం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి