వెలుతురు జాతర;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
కమ్ముకున్న చీకట్లను తరిమేస్తూ
నమ్ముకున్న బ్రతుకులకు విజయం చేకూరుస్తూ 
వేలవేల వెలుగులను వెదజల్లే దివ్యమైన రవళి
మతాలకతీతంగా జరుపుకునే విశేషమైన దీపావళి 

అమావాస్య నిశీధిలో నిండు పున్నమి వెన్నెలోలె 
అజ్ఞానపు చీకట్లను చిదిమేసే జ్యోతులోలె
అన్యాయపు,అరాచకాలకు చరమగీతాలు పాడే చురకత్తులోలె
విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించు కాంతిపుంజమై వచ్చింది దీపావళి 

చెదరని ఆత్మవిశ్వాసమే ఆలంబనగా 
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా
అతివంటే అబల కాదని నరకాసురవధతో
జయకేతనమెగరేసిన దరహాసంగా
జయజయధ్వానాలు చేసుకుంటూ వచ్చింది దీపావళి 
ఇది చీకటి వెలుగుల రంగేళి

ఇంటింటా వెండి వెలుగులకాంతిని నింపే 
ప్రశస్తమైన తెలుగు పండుగలు
ఆశల ఉదయానికివే వెలుగు దారులు.. కామెంట్‌లు