ప్రగతి కిరణాలు;---గాజులనరసింహనాగటూరు గ్రామంకొనిదేలా పోస్ట్నందికొట్కూరు మండలంకర్నూలు జిల్లా9177071129
పిల్లలము మేమండి
బడిపిల్లము మేమండి ||2
బుడుగులము  మేమండి
చిచ్చర పిడుగులము మేమండి  ||పిల్లలము ||

జాతికి రత్నాలం మేమండి
ప్రగతికి కిరణాలం మేమండి
ఈ దేశ పౌరులం మేమండి
నేటి విద్యార్థులం మేమండి ||పిల్లలము||


కులమతాలు చూడములేెండి
సమతావాదం మాదిలేండి
సమభావంతో మెలిగేమండి
సమస్యల సతమతమైనా  నేర్పులం మేమండి ||పిల్లలము


చిరు చిరు నగవులు మావండి
బుడి బుడి అడుగులు మావండి
మా ఆశలే చిగురులు చూడండి
మునుముందుకు మమ్ము రానించండి ||పిల్లలము


క్రమశిక్షణతో మెలిగెదమండి
సమయస్ఫూర్తిని కలిగెదమండి
తలబడి కలబడినా మళ్ళీ కలిసే నేస్తాలం మేమండి 
మమతకు మారుపేరు మేమండి ||పిల్లలము


అక్షర జ్యోతులు వెలిగిస్తాం
అవనికి వెలుగులు తెస్తాం
ముద్దు ముద్దుగా మాటలు చెప్పేస్తా0
మా హద్దుల మేము నడిచేస్తాం  ||పిల్లలము


ఆటల పాటల అల్లరి మాదండి 
కళా ఖండాలలో  కలమే మాదండి
విమర్శలే విస్మరిస్తాం మేమండి 
విజయానికి కదం తొక్కుతా0  మేమండి ||పిల్లలము 


తెలుపు తేటల తెలుగు పదము మేమండి 
గుమ గుమ వంటల కమ్మని రుచులే మా మాటలు అండి
అమ్మానాన్నకు ఎపుడూ ఆరాధిస్తామండి
గురువులకు ఎన్నడూ ఎదురు చెప్పబోము లేండి ||పిల్లలము 


చిరు చిరు చీమల వరసలు మావండి 
చెదరని చక్కని బంధం మాదండి 
చెడు మాటలాడము ఎన్నడూ మేమండి 
జవదాటము పెద్దలు గీసిన గీతలు మేమండి ||పిల్లలము ||


సమాజానికి నవదీపికలం మేమండి
అమానుషాలను పారద్రోలే కాంతులం మేమండి 
కలతలు ఎరుగని కమల పువ్వులం మేమండి 
కలిసిమెలిసి తిరుగు చిన్ని బాలలం మేమండి  ||పిల్లలము||





కామెంట్‌లు