దీపావళి:- బాలగేయం-మమత ఐలకరీంనగర్9247593432
అందాల బాలలు
సుందరమగు తారలు
దీపావళి జువ్వలు
పేల్చినపుడు నవ్వులు

భూచక్రపు రింగులు
గిర్రుమనుచు తిరుగుచు
కురిపించును పువ్వులు
చీకట్లో మెరుపులు

దీపాల కాంతులు
మీ వలెనే వరుసలు
ధరణి యందు దివ్యలు
ధనలక్ష్మి పూజలు

సందడితో పిల్లలు
కాకరపూ వత్తులు
కాల్చెటపుడు చేతులు
అంటుకున్న మంటలు


కామెంట్‌లు