పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
  సమస్యాపూరణం 1
*పురమును కూలంగద్రోసె ముద్దుల ప్రియుడే*
కం.
నిరతము సిరిసంపదలతొ
సురులకు మిన్నగ బ్రతికిన సుగుణాత్ముండే
కరువును భారమ్మని కా
*పురమును కూలంగద్రోసె ముద్దుల ప్రియుడే*
 సమస్యాపూరణం 2
*పురమును కూలంగ ద్రోసె ముద్దుల ప్రియుడే*
కం.
ధరలోనీ మద్యము రుచి
నెరిగిన విలువలను గనక నిక్కపు ప్రేమన్
విరియునె; విధియాటకు కా
*పురమును కూలంగ ద్రోసె ముద్దల ప్రియుడే*

కామెంట్‌లు