నీదే ఎజెండా(చిత్ర కవిత)--మమత ఐలకరీంనగర్9247593432
కూలీగా పుట్టావు
కూలీగా పెరిగావు
కూలిపోతున్నావు నీడలేక....
నీడలేక

కూలీల ఈ బ్రతుకు
మాలికుల యెదచిలుకు
మేలిమిగ మెరిసావు మెతుకులేక...
మెతుకులేక

విద్దెలో సద్దివై
ఇటుకలకు ఎద్దువై
పొద్దుకే ముద్దువై అదుపులేక....
అదుపులేక

మట్టిలో రత్నమై
గోడుకే నీడవై
జాడలో నీ ఉనికి చాటలేక....
చాటలేక

గుడిగట్ట నీ పేరు
బడిగట్ట నీ

పేరు
భవనాన నీ పేరు బ్రహ్మాండము....
బ్రహ్మాండము

కూలీలు లేకుండ
సాగేన ఏ జెండ
శ్రమ నీది యనకుండ బ్రతకలేరు....
బ్రతుకలేరు

కామెంట్‌లు