"పంజాబుకేసరిలాలాలజపతిరాయ్ గారి 93 వ వర్థంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
లాలాలజపతిరాయుడు
చాలగపోరాడినాడుస్వాతంత్ర్యముకై
మేలుగమనభరతాంబకు
మేలునుజేకూర్చితానుమేటిగనిల్చెన్!!!

02.
కం.

పంజాబ్కేసరియైతా
పంజావిసిరెనుబ్రిటీషుపౌరులపైనన్
పుంజీకృతమైవెల్గుల
పుంజమ్మైనిల్చినట్టిబుధజనుడితడున్!!!

03. 
కం.
అతివాదనాయకుడిగా
ప్రతిరోజుననుద్యమించెపలువిధములుగన్
సతతముస్వరాజ్యపోరును
అతులితముగసల్పినాడుఅత్యుత్తముడై!!!
కామెంట్‌లు