మతాబుల్లో వెలుగులు
వెలుగులోన జిలుగులు
జిలుగు వెలుగు వెదజల్లు పండుగ మానవా...!
నారి విల్లును పట్టి
పట్టి బాణము చేపట్టి
చేపట్టి చంపె నరకాసురుని
మానవా...!
జరిగె రావణ వధ
వధతో తొలగెను వ్యధ
వ్యధ తీరలేదు నేటి సీతకు
మానవా...!
ఒక దివ్వె వెలిగింది
వెలుగు హృది నింపింది
నింపె హృదిలో ఆనందాలే మానవా...!
అమావాస్య నిశిలో
నిశిలోని వెలుగులో
వెలుగుల ఆనంద దీపావళి
మానవా...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి