చదువు;-చంద్రకళ. దీకొండ,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.చరవాణి : 9381361384
ఆటపాటల చదువు-
ఆసక్తి కల చదువు
వివేకమిచ్చు చదువు-
విజ్ఞానమిచ్చు చదువు
చదువు బాగా చదువు-
చదివి జగతిని ఏలు
విలువ పెంచును చదువు-
విలువైనదియె చదువు

గౌరవమిచ్చు చదువు-
గంధపుపూత చదువు
సంస్కారయుత చదువు-
సంపదలొసగు చదువు
భవిత కొరకే చదువు-
భావి బతుకున వెలుగు
కావాలి బాలలకు-
కరుణించు  భారతీ...!


కామెంట్‌లు
పొర్ల వేణుగోపాలరావు చెప్పారు…
చాలా బాగా రాశారు చంద్రకళ గారు... అభినందనలు 👌👌👌👏👏👏👍