*అక్షరక్రమకవిత*
*తేటగీతిమాలిక*
*దీ* పములువెలిగించియు దివ్యముగను
*పా* పములుతొలగించెడి పర్వదినము
*ల* క్ష్మిదేవినికొలిచియు లక్షణముగ
*బా* ణసంచభూచక్రాలు *బాగుగాను
*ల* క్ష్మిబాంబులుకాల్చునురయముగాను
*శ్రీ* సమేతంగదీవెన సిరులనిచ్చి
*దే* వతలనంత మ్రొక్కెడి దివ్యధాత్రి
*వి* నయమువిధేయతలునేర్పి ప్రీతితోడ
*నీ* తిధర్మముగూర్పెడి నీరజాక్షి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి