అజ్ఞానాన్ని తొలగించి
విజ్ఞానాన్ని ఇలపంచి
ఎల్లప్పుడు దీవించే
గురువు గారికి జేజేలు
కొడతాం మేం బాజాలు!
మక్కువతో మము కనిపెంచి
ఎక్కువ చదువులు చెప్పించి
మాకై ఎప్పుడు కష్టించే మంచి
మా అమ్మ నాన్నలకు జేజేలు !
నిత్యం కొడతాం మేం బాజాలు!
అమ్మ నాన్నల సృష్టించిన
మాకై వారిని పంపించిన
మా గృహదైవం దుర్గాదేవికి
కొడతాంలే మేమిక జేజేలు
కడతాంలే తప్పక బాజాలు!
కన్న తండ్రిగా తను దీపించి
అన్ని తానై ఇక మురిపించి
అమ్మ నాన్నలను మరిపించి
మురిపించే మాతకతై తాతకు
జేజేలు కొడతాం మేం బాజాలు!
స్వతంత్ర సమరం సాగించి
విజయ దుందుభి మోగించి
స్వాతంత్రాన్నిక అందించిన
మా అమరవీరులకు జేజేలు
నిత్యం కొడతాం మేంబాజాలు!
దండియాత్రను సాగించి
ఉప్పు సత్యాగ్రహం సాధించి
జాతీయ నాయకుల ఏకం చేసిన
గాంధీజీ నెహ్రూజీలకు జేజేలు
నిత్యం కొడతం మేం బాజాలు !
పరతంత్రాన్ని బాగా ద్వేషించి
స్వతంత్రాన్ని వారంతా ఆశించి
సమరం సాగించిన మన ఘన
విప్లవ వీరులందరికి మాజేజేలు
నిత్యం కొడతాం మేం బాజాలు!
విప్లవ వీరుల కథలను చెప్పి
వీరగాథల మూలాలను విప్పి
ప్రజలందరినీ జాగృతపరిచిన
ప్రజా నాయకులకు మాజేజేలు
నిత్యం కొడతాం మేం భాజాలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి