దేవుడు ఒక్కడే! (కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
ఒక్కడే ఒక్కడే ఒక్కడే ఒక్కడే
నీవు నేను అంతా మనమంతా
సేవించే ధ్యానించే దేవుడు ఒక్కడే
ప్రేమించే మనకు ఎందుకు చిక్కడే? 


ఒక్కడే ఒక్కడే ఒక్కడే ఒక్కడే
ఆఒక్క దేవుడే సృష్టించానుగా
ఎన్నో అందమైన లోకాలను
ఆ దైవం బంధమైన మానవుడు
పఠించెనుగా ఎన్నో శ్లోకాలను
అయినా కానరా డే ఆ దేవుడు
బొందిలో జీవిస్తున్న ఈ జీవుడు!

కులాలు మతాలు ఎన్నియున్న
సర్వమతాల సారం ఒకటేకదన్న
మనందరికీ ఆ దేవుడే కద మిన్న
తెలుసుకొని నడుచుకోవాలన్న !

అందరం జీవించే నేల ఒక్కటే
అందరం తాగేటి నీరు ఒక్కటే
అందరం వాడే అగ్ని ఒక్కటే
అందరం పీల్చే గాలి ఒక్కటే !

అందరం ఆనందించే ఆకాశం ఒక్కటే
అందరం అనుభవించే ప్రకృతి ఒక్కటే
ఇలాపంచ భూతాలు ఒకటైనప్పుడు
ఆ దేవుడు కూడా ఒక్కడై ఉన్నాడు ఇప్పుడు.!


కామెంట్‌లు