ఓం నమః శివాయై నమః శివాయ!"మ"కారమే శివము! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌"మ"కారము శుభ కరము!
     "జలము" రూపము! శివము!
     తెలుసుకొను మీ నిజము!
               శంకర ప్రియులార!!
      ( శంకర ప్రియ పదాలు., )
👌శ్రీ శివ పంచాక్షరి యే "తారక మహా మంత్రము"!   "నమః శివాయ".. అయిదు వర్ణములుగల స్థూల పంచాక్షరి! ఇందు లో.."మ"కారము రెండవ వర్ణము!
👌"మ"హైశ్వర్య ప్రదాయ!
     హైమావతీ ప్రియాయ!
     విష్ణు స్వరూపాయ!
     నమో నమః శివాయ!
          ( "మ"కార శివుని ప్రార్ధన)
       "మ"కారము.. పంచ మహా భూతము లలో.. రెండవ దైన "జలము" రూపమును పేర్కొను చున్నది! పంచ కృత్య దివ్య మూర్తు లలో.. "విష్ణు" దేవుని సూచించు చున్నది!
👌భవ తారక మంత్ర మైన "ఓం నమః శివాయ".. ప్రణవ సహిత, శ్రీ శివ పంచాక్షరియే పావన మంత్రము! దీనిని అనుదినము, నియమ నిష్ఠలతో.. జపించండి!
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( కంద పద్యము)
         మనసున తారక మంత్రము,
         తనువందు విభూతి పూత తనరారంగా;
          ఘనతర రుద్రాక్ష లనే
           అనవరతము దాల్చు నట్లు, నను జూడు శివా!
       
       (.. శ్రీ శివ శతకము, డా. శ్రీపాదుక., )
         ( "తారక మంత్రమే "శివ" యను రెండు వర్ణములు! "నమః శివాయ"  అనే పంచాక్షరి, మరియు, "ఓం"కార మనే ప్రణవాక్షరి... తారక మహా మంత్రములు!  "తారక" నామ ధేయుడే పరమేశ్వరుడు! )
          ఓం నమః శివాయ! 
ఓం నమో భగవతే రుద్రాయ!

కామెంట్‌లు