బాలలం (బాల గేయం);-చాపలమహేందర్9949864152

బాలలం మేము బాలలం
చిందులు వేసే పిల్లలం
వెలుగులు పంచే దివ్వెలం
అల్లరి చేసే  అందెలం

ఆనందం పంచే పువ్వులం
ఆరోగ్యమిచ్చే నవ్వులం
రేపటి భారత పౌరులం
చాచా  నెహ్రూ  మిత్రులం

భరతమాత బిడ్డలం
భావిభారత సైనికులం
రేపటి విద్యా సుమములం
బాలలం మేము బాలలం


కామెంట్‌లు