రోజులు మారుతున్నాయి;--సత్యవాణిఅనంతపురం9989085426.
రోజులు గడుస్తున్నాయి
మనుషులు మారుతున్నారు....
పరిచయం  చరవాణి తో మొదలై....
మొదట్లో  హాయ్ గుడ్ మార్నింగ్  తో ఆరంభం .... గుడ్ నైట్ వరకు  జాగర్తలు,  పిలుపులు   అబ్బో.....
ప్రతి వాక్యానికి  జవాబులు....
ప్రశ్నించే  కుశలప్రశ్నలు....
ఈ గమనం లో 
కాలం మారుతుంది...
పరిచయాలు పెరుగుతుంటాయి 
మాటల్లో మార్పులులోస్తుంటాయి ...

పరిచయాలు పెరిగిన మనుషులు....
దూరమౌతున్న మనసులు...
ఆలోచన లో మార్పులు...
నోచుకోని ఓదార్పులు......
ఇంతలో....
మాటలు అపరిమితం అనుకున్న రోజులనుంచి
మెసేజ్  లు పరిమితం లే అనుకుంటున్న రోజుల కు పడి పోయాము 
ఆనందాన్ని... విచారాన్ని....బొమ్మలతో షేర్ చేసుకుంటూ..
బతికేస్తున్నాము...
 ఇక..
మాటలు కరువై.....
చెప్పాలనుకున్న విషయం వివిధ..చిత్ర...విచిత్రాల తో చెప్పి తృప్తి పడుతున్నాము...
చాకోలెట్స్ బొమ్మ చాలా తీయగా ఉంటుందట...
సువాసన కూడా రాని పూల చిత్ర పరిమళం వీళ్లకు 3డి లో అద్భుతం....
ఆలోచన కైనా అందన్నన్ని గదులను తయారు(apps )చేసుకున్న అరచేతి వైకుంఠం లో ఆనందం అనే భ్రమలో బ్రతుకుతున్నాం....
నేటి కాలం లో కలం తో పనిలేదు....
 కాలానికి అనుగుణం గా పోవాలి అనే సర్దుబాటు పదం తో బతికేస్తున్నాము ......
ఇవేమి రోజులో....
ఇకెన్ని రోజులో...
ఈ పట్టిన బూజు వదలడానికి.......కామెంట్‌లు