సందేహం ..!! (మాటలు :ఆన్షి ,రాతలు :కె.ఎల్వీ)

 ఎవరో వచ్చారు ఇంటికి 
నేనెప్పుడూ చూడనివారు 
నన్నెప్పుడూ ఎరగనివారు !
పలకరించాలా ?వద్దా ....?
వారినిలోపలికి 
ఆహ్వానించాలా ?వద్దా ...?
పలకరిస్తే ....
పలకాలా ? వద్దా ....?
ఇన్నిసందేహాలమధ్య 
మామూలుగామాట్లాడే 
తాతమాటలు గుర్తుకువచ్చాయ్!
ఇంటికి  వచ్చిన వారిని-
మర్యాదగా పలకరించాలని ,
విషయం యింట్లో వివరించి 
అత్మీయంగా ఆహ్వానించాలని !!

కామెంట్‌లు