దీప నుతి -డా.అడిగొప్పుల సదయ్య, కరీంనగర్
భువిపైన చీకట్లు భూస్థాపితంబయ్యి
కోటి సూర్యుల వెలుగు కొమరుతో వెలగాలి

దీన జన జీవికన దీప కళికలు పూచి
సంతోష పరిమళపు జలలతలు వీయాలి

కరడు కట్టిన కపట కఠినాత్మలన్నిటను
కరుణార్ద్ర కాంతులే ఖమణులై మెరియాలి

దీపమా! బాహ్యాంతః తిమిరాలు తొలగించి
నవ్య జగతిగ మార్చి సవ్య దిశలో నడుపు

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125

కామెంట్‌లు