గెలవడం అంటే!?;--సునీతా ప్రతాప్,ఉపాధ్యాయిని పాలెం
మార్క్సిజం కుబుసం విడిచి
ప్రజాస్వామ్యం అయ్యింది!?
కులం ఇప్పుడు కుబుసం తొడిగి
కుబేరుడు అయింది!?

పుడితే ఏనుగుల పుట్టాలి కానీ
నక్కని ఎంత పెంచిన ఏనుగు అవ్వదు కదా!

భక్తితో స్తుతిస్తాం ప్రార్థిస్తాం ప్రేమిస్తాం
కానీ దేవుని కూడా నిత్య జీవితంలో పడి మర్చిపోతాం
ఇక మనకు మనమేంగుర్తుంటాం!?

ఒకర్ని గొప్పవాణ్ణి చేయాలంటే
వాడు గొప్పవాడై ఉండక్కర్లేదు 
నీవు గొప్ప వాడివి అయితే చాలు!?

రోగిలా వైద్యుడు ఆందోళన పడకూడదు
చికిత్స అందించాలి
నాయకుడు కూడా అంతే ముందుకు నడిపించాలి!?

గెలవడం అంటే భయాన్ని కలవటం
ఆంజాయిటీ అంటే అజ్ఞానాన్ని కలవడం
భయం అంటే ఆత్మవిశ్వాసం ఆత్మహత్య చేసుకోవడం!?


కామెంట్‌లు