*"చీకటి నుండి వెలుగు వైపు....*
చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే మానసిక వికాసాన్ని కలిగించే పండుగ దీపావళి. అజ్ఞానం అనే చీకటి కమ్మిన అంతవరకు వివేకం కలుగదు. జ్ఞాన జ్యోతి ప్రకాశించ గానే మనలో వివేకం కలుగుతుంది తమసోమా జ్యోతిర్గమయ అంటే అర్థం ఇదే.
దీపం సర్వోత్తమమైనది సత్వ, రజ,తమో గుణాలకు సరస్వతి, దుర్గ ,లక్ష్మీదేవిలు ప్రతీకలుగా పేర్కొన్నది 'ధర్మసింధు' కనుక త్రిగుణాత్మకమైన దీపాన్ని ఆరాధిస్తే ముగ్గురమ్మలను పూజించినట్లే అని ప్రతీతి.
*'అమా' అంటే దాని
తోపాటు 'వాస్య' అంటే
వహించటం. చంద్రుడు సూర్యునిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కనుక 'అమావాస్య' అంటారు. నిజానికి అమావాస్య అంటే అంధకారం కాదు. జ్ఞాన ప్రదీప కాంతితో అది దీపావళి అయ్యింది. ఆ పరమేశ్వర దీపముతోనే ఈ ప్రపంచం' 'ఆదిత్యవర్ణం తమనం పరస్తా త్ " అంటే మానవుని లోని చీకటిని పారద్రోలుతూ వెలుగులు పంచే ఆదిత్య రూపుడైనాడు.మానవాళికి పరమాత్మ స్వరూపమైన దీపం ఐహికా ముష్మిక ప్రదాయిని
దీపావళి పండుగ రోజు లక్ష్మి పూజ విధానం దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి ? అంటే 'సనత్కుమార సంహిత "లో ఒక కథ ఉంది.
దైతరాజైన బలి చక్రవర్తి సమస్త భూమండలాన్ని తన ఆధీనం చేసుకుని లక్ష్మీదేవిని సైతం తన కారాగారంలో బంధింపచేశాడు. లక్ష్మీదేవి బందీ కావడంతో లోకాలన్నీ దరిద్రంతో నిండిపోగా దేవత లందరూ విష్ణుమూర్తిని ప్రార్ధించగా ఆయన వామనావతారంలో బలిని తన ఆధీనంలోకి తెచ్చుకొని పాతాళలోకానికి తొక్కేసి, సమస్త దేవతలతో పాటు తన ధర్మపత్ని అయిన శ్రీ లక్ష్మిని కూడా విడుదల చేయించాడు. లక్ష్మీ విడుదలైన రోజు 'అమావాస్య ' కాబట్టి ఆ రోజు దేవతలందరూ దీపాలను వెలిగించారనీ , ఇదే రోజు భూమండలం మీద లక్ష్మీదేవి విహరించడానికి వస్తుందని ఇదే ఆచారం దీపావళిగా రూపాంతరం చెందిందని తెలుపబడింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి నాడు లక్ష్మీపూజ జరుపుకోవడం జరుగుతుంది. సంపద అభివృద్ధి చెందడానికి కారణమైనది ధనలక్ష్మిగా భావిస్తూ దీపావళినాడు లక్ష్మీపూజ చేయడం సంప్రదాయంగా వచ్చిందని మనకు పద్మ పురాణంలో పేర్కొనబడింది. దీపావళి గురించిన గాథలు పురాణాలలో ఎన్నో ఉన్నాయి. జ్ఞానానికి, ఐశ్వర్యానికి , సంపద ఆనందాలకు ప్రతీకగా దీపావళిని భావిస్తారు.
సాయంత్రం ఆ లక్ష్మి తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహించాలని లక్ష్మీపూజ చేస్తారు నరక చతుర్దశినాడు సంప్రదాయం తెలిసిన వారు స్వయంగా శుభ్రం చేసిన వత్తులను తయారు చేసుకొని వరిపిండితో చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి బ్రాహ్మణునికి దానం చేస్తారు.
మూడవ రోజు బలి పాడ్యమి, మానవులను సన్మార్గంలో పెట్టడానికి చెడును అంతం చేయడానికి మంచిని ప్రోత్సహించడానికి మార్గదర్శకాలే మన పండుగలు. మన పండుగల వెనుక దైవారాధన ముఖ్య ప్రక్రియగా ఉంటుంది.
*మానవులలోని అజ్ఞాన తిమిరం పోగొట్టాలి అంటే ఆత్మజ్యోతి నిత్యం ప్రకాశవంతంగా వెలగాలి. అందుకు భక్తి,ఏకాగ్రత, తత్వజ్ఞానం అవసరం*
మనం సాధారణంగా దీపావళి అనగానే సత్యభామ నరకాసురుని వధించిన, రోజుగా భావిస్తాము. కానీ ఒక్కసారి మన పురాణాలను చారిత్రకంగా పరిశీలించినట్లయితే దీపావళి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
* పాల సముద్ర మధనంలో లక్ష్మీదేవి ఉద్భవించినది దీపావళి అమావాస్యనాడు అందుకే వ్యాపారస్తులు లక్ష్మీదేవిని అర్ధరాత్రివేళ ఆరాధిస్తారు. అర్ధరాత్రి వేళ ఆమె బయలుదేరుతుందని వారి విశ్వాసం.
* విష్ణుమూర్తి తన పంచన అవతారమైన వామనావతారంలో లక్ష్మీదేవిని బలిచక్రవర్తి చెర నుండి రక్షించిన రోజు దీపావళి.
* మహాభారతములో దీపావళి 'కార్తీక అమావాస్య"గా ప్రస్తావించారు. కౌరవుల చేత ఓడించబడి పాండవులు వనవాసం, అజ్ఞాత వాసాలు ముగించుకొని తిరిగి నగరానికి వచ్చిన రోజును దీపావళిగా పురాణాలు చెబుతున్నాయి.
* రావణుని సంహరించిన తర్వాత రాముడు సీతా లక్ష్మణులతో అయోధ్య చేరిన రోజున ప్రజలు దీపావళి జరుపుకున్నట్లుగా, మరో కోణంలో చరిత్రలో ధర్మబద్దు డిగా వాసికెక్కిన హిందూ చక్రవర్తి విక్రమాదిత్యుని రాజ్య పట్టాభిషేకం జరిగింది దీపావళి నాడేనని, ఆధారాలున్నాయి.
* ఆర్య సమాజాన్ని స్థాపించి హిందూ మత సంస్కరణలకు కృషి చేసిన స్వామి దయానంద దీపావళి రోజునే నిర్యాణం స్థితి పొందినారు..... ఇలా దీపావళి పండుగ గురించిన ఎన్నో గాథలు ఉన్నాయి లోకకంటకుడైన నరకుడు భూమాతయైన సత్యభామ, శ్రీకృష్ణులచే సంహరింపబడిన దినం నరక చతుర్దశిగా మనం జరుపుకుంటున్నాం.
*మనం బాధల్లో ఉన్నామని లక్ష్మీదేవిని నిందించకూడదు. బాధలను సహిస్తూ నే మహాలక్ష్మి ఆమె కృప కోసం నిరంతరం భక్తి శ్రద్ధలతో పూజించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఆధ్యాత్మికమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. దారిద్ర్యం మనిషిని కృంగదీసే నిర్వీర్యం చేస్తుంది కనుక మనం సంయమనంతో నియమబద్ధంగా లక్ష్మీదేవిని ఆవు నేతితో అభిషేకిస్తే ఐశ్వర్యం. ఇక్షురసముతో ధనంలో వృద్ధి, జనంతోదరిద్రం విముక్తి , లక్ష్మీదేవికి పంచ వత్తుల దీపారాధన చేస్తే ఆర్ధిక పరమైన ఈప్సీతాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన, అనుగ్రహానికి పాత్రులమౌదాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి