తొలి పొద్దు పొడిచే వేళలో
కోయిల స్వరాల పల్లకి లో
వలపుల తలపుల సందడిలో
కనురెప్పల కాటుక కన్నులలో
పరువపు తలపుల
బందీనై
ఓ మౌనరాగం స్వరముల రాగాలై
మదినే దోచేస్తుంటే..
ఊహల పొదరింట్లో
చెలిమి చెంగల్వలై
విరిసిన హరివిల్లుల
రంగుల కలల ప్రపంచం లో నీతోనే చెప్పాలని
ఓ గుప్పెడంత స్నేహం పొందాలని మదిలో
కలవరింతలై కలవరపెడుతున్నా..
చిరు జల్లుల మమతల
కౌగిలిలో
చలచల్లగ వీచే చల్లని గాలుల ఊయలలో
లతలా పెనవేసిన ఈ బంధం
జన్మ జన్మల అనుబంధమై జీవితమంతా నిలవాలని
ప్రతిక్షణం నీవే నా సొంతమవ్వాలని
కలిసుండాలని
ఆ చిత్తరువునే చిత్రంగా ఒక సెల్ఫీ ప్లీజ్ అంటూ మదిలోనే దాచేసా..
ఇంతివి నీ వంటూ చేమంతి వి-బంతివి పూబంతివి నీవంటూ
నీ నవ్వుంటే తిరునాళ్ళే అంటూ
కనుగీటే నీ చిలిపి చేష్టల విందులే నావంటూ మురిసిపోవాలని
నీ మనసున మనసై కొలువై జీవితమంతా కాపలానే శాశ్వతంగా
తోడూ-నీడై, కలకాలం కలిసుండాలని
నుదిటిపై నీ సొగసే సింధూరంగా నిలపాలని,
సౌభాగ్యంతో మెరవాలని నీ ఆరాధనలో భారంగా
క్షణమే యుగమై కాలంతో కరిగి పోతున్నా కొవ్వొత్తిలా...
కోయిల స్వరాల పల్లకి లో
వలపుల తలపుల సందడిలో
కనురెప్పల కాటుక కన్నులలో
పరువపు తలపుల
బందీనై
ఓ మౌనరాగం స్వరముల రాగాలై
మదినే దోచేస్తుంటే..
ఊహల పొదరింట్లో
చెలిమి చెంగల్వలై
విరిసిన హరివిల్లుల
రంగుల కలల ప్రపంచం లో నీతోనే చెప్పాలని
ఓ గుప్పెడంత స్నేహం పొందాలని మదిలో
కలవరింతలై కలవరపెడుతున్నా..
చిరు జల్లుల మమతల
కౌగిలిలో
చలచల్లగ వీచే చల్లని గాలుల ఊయలలో
లతలా పెనవేసిన ఈ బంధం
జన్మ జన్మల అనుబంధమై జీవితమంతా నిలవాలని
ప్రతిక్షణం నీవే నా సొంతమవ్వాలని
కలిసుండాలని
ఆ చిత్తరువునే చిత్రంగా ఒక సెల్ఫీ ప్లీజ్ అంటూ మదిలోనే దాచేసా..
ఇంతివి నీ వంటూ చేమంతి వి-బంతివి పూబంతివి నీవంటూ
నీ నవ్వుంటే తిరునాళ్ళే అంటూ
కనుగీటే నీ చిలిపి చేష్టల విందులే నావంటూ మురిసిపోవాలని
నీ మనసున మనసై కొలువై జీవితమంతా కాపలానే శాశ్వతంగా
తోడూ-నీడై, కలకాలం కలిసుండాలని
నుదిటిపై నీ సొగసే సింధూరంగా నిలపాలని,
సౌభాగ్యంతో మెరవాలని నీ ఆరాధనలో భారంగా
క్షణమే యుగమై కాలంతో కరిగి పోతున్నా కొవ్వొత్తిలా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి