బుడి బుడి అడుగుల బాల్యం
నేడు రంగుల ఓణీలో హరివిల్లులా విరబూసిన నవయవ్వన పారిజాతాలం ...
అందాల ప్రకృతి వనంలో
జల జలా జాలువారుతున్న
ఓయ్యారాల జలపాతాలం
ఊహల సౌధాన విహరిస్తున్న
సౌందర్య రాశులం ...
ఎదవాకిట తడుతున్న
తుంటరి కోరికలుతో
మౌనంగా గుసగుస లాడుతున్న
ముద్దు గుమ్మలం
రెప్పలు వాల్చని నయనాలు
తన్మయత్వం తో తమేకంగా
మయమరచిన తనువులుతో
భాగస్వామి రాకకై ఎదురు చూస్తున్న
భామా మణులం ....
అంతరంగ తరంగాలు ఎగసి పడే
మౌన మది తీరాన....
అడుగడుగునా అవాంతరాలు
ఎదురయ్యే తరుణంలో
ఆలోచనలే ఆయుధాలగా
మలచుకున్న నాడే తరుణి
బ్రతుకు బంతి పూల వనం మాదే
భవిష్యత్ పయనానికి
వేసే అడుగు తడబడనీయకు
గుప్పెడు గుండెకు నీ అంతరంగ
పరిచారిక నీ మనః సాక్షికి
నీ ధైర్యమే రాబోయే దాంపత్య
బంధానికి నీవే నిలువుటద్దం మేమే
పదే పదే చెప్తుంది పదిలంగా మనసు
రాబోయే కలల
రాకుమారుడిహృదయ
రాజ్యానికి పట్టపు రాణీ
మేమే అని .....
సకల సంతోషాల సిరి సంపదలు
మావే అని ......
నిజం కాబోతున్న మా కలల ప్రపంచం మాదే.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి