సామాజిక బాధ్యత ;-మోర స్వప్న-కలం స్నేహం
మానవత్వం పరిఢవిల్లిన క్షణాన
స్వార్థరహితమైన మనసు గాంచెను
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని
నేనున్నానంటూ ముందుకు వెళ్లిన యువకిరణం!!

ముందున్నది ఒకటే కర్తవ్యమతనికి
ఆయుష్షునందించాలనే సత్సంకల్పం
సమయస్పూర్తితో సద్భావనతో...
ధైర్యసాహసాలతో.... కాపాడేందుకు కదిలెను!!

రక్తసంబంధమే అక్కర లేదు
రక్తమోడుతున్న వారిని కాపాడేందుకు...
బంధువర్గమే అవసరం లేదు
బంధనాలను నుండి రక్షించేందుకు...
సాయపడే మనసుంటే చాలు
సాటి మనిషిని ఆదుకునేందుకు...

మారలి ఇకనైనా మనమంతా
ఆపదలో ఉన్నవారికి అభయమిచ్చేందుకు...
ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉండేవే
ఇపుడు ఇక్కడైతే రేపేక్కడో ఒక చోట
అది మనకే కావచ్చు మన వాళ్ళకే రావచ్చు!
కనుక బాధ్యతగా భావిద్దాం !
ఒకరికొకరు తోడుగా నిలిచి...
సామాజిక బాధ్యతను నెరవేర్చుదాం!
విశ్వమానవ సౌభ్రతృత్వాన్ని చాటుదాం!!


కామెంట్‌లు