పొడుపు కథలు.సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

 1. తొండము ఉంటుంది విఘ్నేశ్వరుడిని కాదు. రంగులు ఉంటాయి కానీ ఇంద్రధనస్సు ని కాను. పేరులోనే కోక. ఒంటి మీద వస్త్రం ఉండదు.
జవాబు. సీతాకోకచిలుక.
2. మెత్తని దాన్ని, పసుపుపచ్చని దాన్ని, ఉమ్మడి కుటుంబాన్ని, ముద్దు పేరు ముద్ద.
జవాబు . ముద్దబంతి పువ్వు.
3. ఒంటినిండా పళ్ళు. కొరకడం తెలియని పిచ్చిది. చిక్కులు వి పడడమే దాని పని.
జవాబు . దువ్వెన.
4. పాలరాతి విగ్రహానికి బంగారు తొడుగు.
జవాబు. వడ్లగింజ.
5. అందరికీ ఓకే కొడుకు. ఒకే కూతురు.
జవాబు. పెండ్లికొడుకు పెండ్లి కూతురు.
6. కటకట మంచం. కటారు మంచం. ఎంత తొక్కినా ఇరగని మంచం.
జవాబు. భూమి.
7. ఒంటి స్తంభం మేడ. ఆ మేడకు వడ్డానం పెట్టారు.
జవాబు. చేతి వేలుకు ఉంగరం.
8. ఒక కన్ను కలదు కాకి కాదు. ఒక కన్నం ఉంది. పొట్ట కాదు.
జవాబు. సూది.
9 కోట గాని కోట. ఇంటికో కోట. ఇంపైన కోట.
జవాబు. తులసి కోట.
10. చూసింది ఇద్దరు. కోసింది ఐదుగురు. తిన్నది 32 మంది.
జవాబు. కళ్ళు, వేళ్ళు, పళ్ళు.
కామెంట్‌లు