చార్మినార్ సమ్మోహనాలు ;-ఎం. వి. ఉమాదేవి.
కుతుబ్ షాహీ వంశ 
వంశ కీర్తికి అంశ
అంశగా చార్మినార్ వెలిసింది ఓ ఉమా !

భాగ్య నగరికి మధ్య 
మధ్య అనితర సాధ్య 
సాధ్యమ్ము కానిదిది కట్టడము ఓ ఉమా!

నాల్గు బురుజుల శోభ
శోభ గవాక్ష ప్రభ
ప్రభలయ్యి వెలిగింది చార్ మినార్ ఓ ఉమా!

ప్రేమికులు యాత్రికులు 
యాత్రలో ఔత్సికులు 
ఔత్సకుల అపురూప దర్పణము ఓ ఉమా!

కూడలిన గాజులను
గాజు ముత్యాలుగను
ముత్యాల నగలతో అంగళ్ళు ఓ ఉమా!

వెండి మెరుగులు ఇచట 
ఇచట లేనివి ఎచట
ఎచటనూ దొరకనివి ఇచటనే ఓ ఉమా!

రహదారి కూడలిగ
కూడ మొఘల్ సిరిగ
సిరిగనే నిలిచింది గర్వoగ ఓ ఉమా!

పైకెక్కి చూసినను
చూసినగరమంతను 
నగరమే కన్పించు బొమ్మలుగ ఓ ఉమా!


కామెంట్‌లు