. రైతు సంబురం;-అరుణ బట్టువార్-కలం స్నేహం
రైతన్న నీ శ్రమకు ఫలితం లభించిన వేళ ....
నీ మోము వెన్నెల రేడు 
వోలె వెలుగులే  కదా !

నేల దన్నుతూ విత్తులు నాటిన
 తరుణాన అవి మొలకెత్తు దశలో
 నీ కంటి చూపుల్లో కాంతులు నిండు 
పున్నమి నేలను ముద్దాడిన సంబరాలు

అమ్మలక్కలంతా కలిసి విత్తులు నాటుతూ 
పాడే జానపదుల పాటలు
 కర్ణామృతపు కోకిల స్వరాలేగా

మేఘాలు గర్జించి వాన
దేవుడు కరుణించి వర్షించ
 ప్రకృతము పరవశించి ..
పచ్చని పట్టు కోకనే గట్టదా

పంట పైరు ఎదిగిన వేళ
మీ మధిన ఆనంద రేఖలు
నింగి లోని హరివిల్లు నేలను తాకిన  
యంతటిసంతోషమే కదా

ధాన్య సిరులుఇంటికొచ్చే వేల

 లక్ష్మీదేవి నీ ఇంట కొలువుండగ 
మీమది కార్తీకపున్నమి వెలుగులేగా

మీ సంబరం అంబరాన్ని అంటే వేళ 
ప్రతి గుమ్మం తలపించదా
 దీపకాంతి శిఖలోలె.

పంటలకు తగిన ధర 
పలికి  డబ్బు ....
చేతికి రాగా కనులలో తేజోబి షేకాలు.
మనసున ఆనంద అభిషేకాలే సుమ.

దేశాన ఆర్థిక మాంద్యం తగ్గి
తల్లి భారతి జనని హృదయం 
బంగారు ఊయలలే ఊగదా

కామెంట్‌లు