కోటికి పడగెత్తటం.
పోకకు పుట్టేడమ రోజుల్లో పోక చచ్చాడు అనేవాళ్ళు. పోకకు పైసాకు ఉన్నంత విలువ ఉండేది. ఆ రోజులలో గవ్వకు కూడా డబ్బు కున్నంత విలువ ఉండేది. ఏమయ్యా ఏమన్నా నా పైకం ఉన్నదా అంటే, ఏమి చెప్పమంటారు అండి నా చేత ఒక చిల్లిగవ్వ కూడా లేదు అనేవాడు. గవ్వ అంటే పైసా అని పేరుండేది. నా చిన్నతనంలో నేను చిల్లీ లో ఉండే పైసలు చూశాను. ఆ పైసలను వాడుకునే వాళ్ళము. అసలు అర్థం ఏమిటంటే గవ్వలు అంటే రూపాయలు, పైసలు, డబ్బులు అని అర్థం. కొన్ని రోజుల క్రితం లక్షలు ఉంటే లక్షాధికారి అనేవాళ్ళు. ఒకప్పుడు లక్షాధికారి అంటే గొప్ప. ఇప్పుడు లక్షాధికారులు లక్షల సంఖ్యలో ఉన్నారు. కోటీశ్వరులే తక్కువ. కోట్లు గడించిన వాళ్లు తాహతును గుర్తుగ ఇంటికి ఒక జెండా లేదా బావుటా లేదా పతాకం నాటేవారు. పతాకాన్ని పడగా అనేవారు. ఇప్పుడా పద్ధతి లేదు. దొంగల భయానికి, దోపిడి భయానికి, మరింకే భయానికి ఆపడగల నెట్టటం మానేసి సొమ్మును బ్యాంకులలో దాచుకుంటున్నారు. అయినా పాత అలవాటు ప్రకారం కోటికి పడగలెత్తుతారు. అనే వాడుక జాతీయాల లో ఉన్నది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి