ఏమని రాయను!
ఎంత ఆలోచించినా ఒక్క భావనా
మెదడుని చీల్చుకు రాదేం?
పేపర్ మీద పెట్టిన పెన్ను
కదలునని మారాం చేస్తోంది
విరిసిన పువ్వులను చూసి
ఎగిరే సీతాకోక చిలుకలను చూసీ
పసి పాపల బోసి నవ్వులు చూసి
తల్లి చెంతకు గంతులు వేస్తూ ఎగిరే తువ్వాయిలను చూసి
ఎగిరి గంతులు వేసే నా మది
రాగాలు రవళించని వేణువులా
మూగబోయింది ఎందుకో !
అయిదేళ్ల పాప మొదలు
అరువది ఏళ్ల అవ్వ వరకు
మానవత్వం మరచిన మృగాళ్ల
బారిని పడి ప్రాణం, మానం
మంటగలసి సమిధలుగా మారుతుంటే
మనసు స్తబ్ధమై
హృదయం కరిగి కన్నీరై
మాటలు కరువైన మది మూగ బోయింది.
ఎంత ఆలోచించినా ఒక్క భావనా
మెదడుని చీల్చుకు రాదేం?
పేపర్ మీద పెట్టిన పెన్ను
కదలునని మారాం చేస్తోంది
విరిసిన పువ్వులను చూసి
ఎగిరే సీతాకోక చిలుకలను చూసీ
పసి పాపల బోసి నవ్వులు చూసి
తల్లి చెంతకు గంతులు వేస్తూ ఎగిరే తువ్వాయిలను చూసి
ఎగిరి గంతులు వేసే నా మది
రాగాలు రవళించని వేణువులా
మూగబోయింది ఎందుకో !
అయిదేళ్ల పాప మొదలు
అరువది ఏళ్ల అవ్వ వరకు
మానవత్వం మరచిన మృగాళ్ల
బారిని పడి ప్రాణం, మానం
మంటగలసి సమిధలుగా మారుతుంటే
మనసు స్తబ్ధమై
హృదయం కరిగి కన్నీరై
మాటలు కరువైన మది మూగ బోయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి