పచ్చని మనసులు;-అల్లాడి వేణు గోపాల్;-కలం స్నేహం

 పల్లవి:
అతడు:
పచ్చగా పరుచూకున్న 
చేనూ లోన చెట్టూ గట్టూ
ఎంత చూసినా తనివే తీరదులే
ఆమె:
వెచ్చనీ కౌగిలిలోన
ఒదగాగానే నువ్వూ నేను
మనసు గాలిలో హాయిగ తేలెనులే
చరణం1
అతడు:
చల్లని గాలికి ఉల్లమే ఊగేనే
అందాల లోగిలిలో లోకమే కనపడదే
నరనరాన జువ్వనిపించే                                     గిలిగింతల రాగం... ప్రేమేలే
పల్లవి:
అతడు:
పచ్చగా పరుచూకున్న
చేనూ లోన చెట్టూ గట్టూ
ఎంత చూసినా తనివే తీరదులే
ఆమె:
వెచ్చనీ కౌగిలిలోన
ఒదగాగానే నువ్వూ నేను
మనసు గాలిలో హాయిగ తేలెనులే
చరణం 2
అతడు:
పగలైనా రేయైనా
తేడా లేదులే
యుగమే క్షణమౌ నీ చెంత
(2 సార్లు)
సూర్యకిరణాన్ని తలదన్నే నీ తేజమే
చంద్రబింబాన్ని మరిపించే నీ అందమే
గుండెనే పవిత్రగుడిగా నీ కొరకై మలచేశా
పల్లవి:
అతడు:
పచ్చగా పరుచూకున్న
చేనూ లోన చెట్టూ గట్టూ
ఎంత చూసినా తనివే తీరదులే
ఆమె:
వెచ్చనీ కౌగిలిలోన
ఒదగాగానే నువ్వూ నేను
మనసు గాలిలో హాయిగ తేలెనులే
చరణం 3:
ఆమె
ఎన్నేళ్ళు చెప్పుకున్నా
తరగని ఊసులు
నిన్నూ...నన్నూ వదలవులే
(2 సార్లు)
నడకలో పడకలో నా ధ్యాస నీపైనే
ఏడేడు జన్మలలో నా పయనం నీతోనే
కలలో సైతం విడువక కవ్వించు నీ రూపమే
పల్లవి:
ఆమె:
వెచ్చనీ కౌగిలిలోన
ఒదగాగానే నువ్వూ నేను
మనసు గాలిలో హాయిగ తేలెనులే
అతడు:
పచ్చగా పరుచూకున్న
చేనూ లోన చెట్టూ గట్టూ
ఎంత చూసినా తనివే తీరదులే
చరణం 4:
ఆమె:
ఏ మాయ చేశావో...మంత్రమే వేశావో
మత్తే చల్లావో... మన్మథ బాణం విడిచావో
మనసూలోన దూరేసేసి 
ఉక్కిరిబిక్కిరి చేసేశావే
పల్లవి:
ఆమె:
వెచ్చనీ కౌగిలిలోన
ఒదగాగానే నువ్వూ నేను
మనసు గాలిలో హాయిగ తేలెనులే
అతడు:
పచ్చగా పరుచూకున్న
చేనూ లోన చెట్టూ గట్టూ
ఎంత చూసినా తనివే తీరదులే
కామెంట్‌లు