బాలబాలికలం మేము
భావిపౌరులం మేము
నచ్చనిపనులు మేముచేయము
ఇష్టమైనవే చేసేస్తాం
!!బాల!!
కోపము తాపము మాకునచ్చవు
అల్లరిపనులే మాకిష్టం
బలవంతాలు మాకునచ్చవు
ఆటాపాటా మాకిష్టం
!!బాల!!
బడితెపూజలు మాకునచ్చవు
కథలూనవ్వులు మాకిష్టం
తొడపాశాలు మాకునచ్చవు
మెదడుకుపదును మాకిష్టం
!!బాల!!
నాల్గుగోడలు మాకునచ్చవు
ఆరుబయలే మాకిష్టం
శిక్షలు కక్షలు మాకునచ్చవు
దయజాలి మాకిష్టం
!!బాల!!
చేసేద్దాం (బాలగేయం);-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి