పాఠశాల ఆయాకు సన్మానం

 తొట్టంబేడు: మండలం లో పెన్నలపాడు ప్రాధమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న జయంతిని ప్రపంచ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా
పాఠశాల విద్యాకమిటి మరియు విద్యా ర్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ 'పాఠశాల పరిశుభ్రత పరిరక్షణ లో విధులు నిర్వహిస్తున్న ఆయాల పట్ల 
గౌరవం కలిగి ఉండాలని' అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాకమిటి సభ్యులు లక్ష్మీ కాంతం,ఆది లక్ష్మీ,ఆయా
జయంతి, ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం,దినకర్ , విద్యార్థులు
పాల్గొన్నారు.
కామెంట్‌లు
Venkata Ramana Rao చెప్పారు…
చాలా సంతోషంగా ఉంది. ఆయాలని గుర్తించడం ఒక ఉన్నతమైన ఉదాత్తమైన గౌరవం. పిల్లలలో ఇది ఒక మంచి దృక్పథాన్ని కలిగిస్తుంది.మీకు మా అభినందనలు