4. “నీవు ప్రతిఫలించడమే” నీ జీవతత్వం నా సమస్తాంగాలలో నిండి ఉందనే జ్ఞానంతో ఈ దేహాన్ని పవిత్ర ఆలయంగా భావిస్తాను. ఈ శరీరంలోని అంగాంగం విచక్షణ, జ్ఞానకాంతులను పొందగలగడానికి కారకుడవు నీవే. ఈ సత్యం అవగాహన అయింది గనుక అసత్యాన్ని ఇక దేహంలోకి అడుగుపెట్టనివ్వను. నువ్వు నా మనోమందిరంలో సుస్థిరుడవై వున్నావు. నీవు నిలిచిన మనస్సులోకి చెడు తలంపును రానివ్వను. దానిని కుసుమకోమల ప్రేమాలయంగా మార్చుకుంటాను. నా కార్యాచరణల్లో వ్యక్తమయ్యే 'పరిణతి' “నీవు ప్రతిఫలించడమే” అనే ఎరుకతో నా ప్రతిదినచర్యలో నిన్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాను.
గీతాంజలి --రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి