తమిళ సినిమా భీష్ముడు. బంధాలకు, అనుబంధాలకు కొత్త వర్ణాలు అద్దిన పితామహుడు. శతకం అందుకున్న దర్శక శిఖరం కె. బాలచందర్ ముచ్చట్లు....
తంజై జిల్లాలో నల్లమాంగుడి అగ్రహారంలో 1930 జూలై 9వ తేదీన జన్మించిన బాలచందర్ కళా జగత్తు జీవనపయనం బాల్యంలోనే నాటకాలతో శ్రీకారం చుట్టుకుంది.
చెన్నై ఎజీ ఆఫీసులో పన్నెండేళ్ళపాటు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు నాటకాలు వేస్తూ వచ్చారు.
ఆయన నటించిన మేజర్ చంద్రకాంత్ నాటకం విశేష ఆదరణ పొందింది. ఎదిర్ నీచ్చల్, నానల్, వినోద ఒప్పందం వంటి నాటకాలుకూడా ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి.
కమలహాసన్, రజనీకాంత్, నాజర్, ప్రకాష్ రాజ్, పూర్ణం విశ్వనాథన్, శరత్ బాబు, చార్లీ, వివేక్, ఎస్.పి.బి. తదితరులెందరినో వెండితెరకు పరిచయం చేసిన బాలచందర్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పాందారు. ఈయనను చూడటంతోనే లేచి నిలబడేవారు రజనీకాంత్.
వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన బాలచందర్ తొలి చిత్రం "నీర్కుమియి."
తొలి రోజులలో బాలచందర్, కళైైంజ్ఞర్ కరుణానిధి నివసించిన గోపాలపురంలో ఆయన ఇంటికి దగ్గర్లోనే మూడో వీధిలో ఉండేవారు. కరుణానిధిని కలుసుకోవాలన్న బాలచందర్ కల ఆయన నాటకాలలో పేరు గడించిన తర్వాతే నెరవేరింది.
జాతీయ స్థాయిలో పురస్కారం, రాష్ట్ర స్థాయిలో అవార్డు, పద్మశ్రీ, అన్నా అవార్డు, కళైమామణి, ఫిలింఫేర్, విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాలు ఇలా ఎన్నెన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్నారు బాలచందర్.
ఆయన భార్య పేరు రాజం.
కవితాలయా ప్రొడక్షన్సులో ఉన్న పుష్ప కందస్వామి, కైలాసం, ప్రసన్న బాలచందర్ దంపతుల పిల్లలు. మూడవ సంతానం చాలా కాలం తర్వాత పుట్టడం వల్ల ప్రసన్నా అంటే గారాబం ఎక్కువ.
పి.యు.సి. చదివాక ముత్తుపేటలో ఒక సంవత్సరం స్కూల్ టీచరుగా పని చేశారు.
ఈ ఏడాది కాలాన్ని ఆయన "గాలి జోల పాట పాడిన కాలం" అని అంటుండేవారు.
తోట కళ అంటే ఎంతో ఇష్టం. ఎవరి సాయంకోసం చూడక ఆయన ఇంటినీ తోటనూ తానే ఊడ్చి శుభ్రంగా పెట్టుకునే వారు. ఈ పని ఆయనకు చాల ఇష్టం. శ్రద్ధగా చేసేవారు.
శ్రీదేవి, జయప్రద, సరిత, సుజాత, శ్రీప్రియ, జయసుధ, జయచిత్ర, గీత, శ్రీవిద్య, సుమిత్ర, జయంతి, మధుబాల, రమ్యకృష్ణన్ వంటి తారలెందరినో సినీప్రపంచానికి అందించారు.
ఎంజిఆర్ నటించిన దైవత్తాయ్ సినిమాకు మాటలు రాశారు.
శివాజీ నటించిన సినిమాలలో ఒకే ఒక్క సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు.
ఆ తర్వాత ఈయన తానే హీరోహీరోయిన్లను పరిచయం చేస్తూ సినిమాలకు దర్శకత్వం వహించారు.
జలపాతాలు, సముద్రతీరాలు ఈయన సినిమాలలో తప్పకుండా కనిపించేవి.
అచ్చమిల్లయ్ అచ్చమిల్లయ్ (భయం లేదు) సినిమాలో నటీనటుల పేర్లతోపాటు జలపాతం పేరును స్క్రీన్ మీద చూపించారు.
వినాయకుడే ఈయన ఇష్ట దైవం.
స్కూల్ రోజుల్లో వీధి చివరున్న వినాయకుడి గుడిలో ఈయనకు పూజార్చన చేసిన అనుభవముంది. ఇంటికి పేరు కూడా వినాయకా అనే ఉండేది.
బాలచందర్ తండ్రి 18 రూపాయల జీతానికి గ్రామాధికారిగా పని చేసి ఈయనకు కాలేజీ చదువు చెప్పించారు. తండ్రి ఆశ ఏంటంటే బాలచందర్ కలెక్టరవాలని. అయితే తాను సినీ జగత్తులో అందుకున్న శిఖరాగ్రాన్నీ పొందిన పేరుప్రఖ్యాతులను తండ్రి చూడలేకపోయారన్న బాధ బాలచందర్ కి ఉండేది.
1972 మార్చి పదో తేదీ వరకు చైన్ స్మోకర్. మార్చి పదకొండో తేదీ గుండెపోటు రావడంతో పొగ తాగే అలవాటుకి టాటా చెప్పేసారు.
కవితాలయా అనే సంస్థను స్థాపించి ఇదే బ్యానర్ పై 56 సినిమాలు అందించారు. రజనీకాంత్ తో మొదలుపెట్టి జీవన్ వరకూ ఆయన ఆధ్వర్యంలో నటించని వారు లేరంటే అది అతిశయోక్తి కాదు.
తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషలలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలచందర్ "ఏక్ తుజే కేలియే" సినిమాతోనే కమలహాసన్ హిందీ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకోసం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన "తేరే మేరే ...." పాట ఆల్ టైమ్ హిట్!
నటుడు ఎం.ఆర్. రాధా నటనంటే బాలచందర్ కు ఎంతో ప్రియం. సందర్భమొచ్చినప్పుడల్లా ఎంఆర్ రాధా నటనను పొగిడేవారు.
అన్నాదురై అంటే బాలచందర్ కి గౌరవం
ఇరు కోడుగల్ అనే సినిమాలో అన్నాదురైని చూపించకపోయినప్పటికీ ఆయన గొంతుని వినిపించారు.
బుల్లితెర సీరియల్స్ లో చిన్న వేషంలో కనిపించిన బాలచందర్ డైరెక్టర్ తామిరా "రెట్టచ్చుయిల్"లో మిత్రుడు భారతిరాజాతో కలిసి ప్రధాన పాత్రలో నటించారు
సినిమాలు చూసి అవి హృదయాన్ని ఆకట్టుకుంటే వెంటన్ ఆ సినిమా దర్శకుడిని ప్రశంసిస్తు పెద్ద ఉత్తరం రాసేవారీయన. అంతేకాకుండా ప్రత్యక్షంగా కలిసి వెన్నుతట్టి పొగిడేవారు. 16 వయదినిళే సినిమాను చూసాక భారతిరాజా పాదాలకు నమస్కరిస్తానని బాలచందర్ చెప్పగానే భారతిరాజా ఆశ్చర్యపోయారు.
షూటింగ్ ఉందంటే తెల్లవారుజామున నాలుగున్నరకల్లా నిద్ర లేచేసేవారు. లేదంటే ఆరు గంటలకు లేచేవారు.
ఒకే ఒక్కసారి సినిమా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దీర్ఘకాల సమస్యలు ఆయన దృష్టికి వస్తే వాటికి తెర దించేవారు.
దూరదర్శన్ లో 1990 లలో ప్రసారమైన రైల్ స్నేహం సీరియల్ కు విశేష ఆదరణ లభించింది. కై అళవు మనసు, రఘువంశం, అన్ని వంటి సీరియల్స్ కూడా ఈయనకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. అన్ని సీరియల్ తెలుగులో వదిన పేరుతో ఓ తెలుగు ఛానల్లో వచ్చింది. దీనికి గణేష్ పాత్రోగారు మాటలు సమకూర్చారు. ఈ సీరియల్లో కొన్ని ఎపిసోడ్స్ కి నేను తమిళం నుంచి తెలుగు మాటలు రాశాను. మల్లికార్జున్ గారనే ప్రొడక్షన్ మేనేజర్ వల్ల గణేశ్ పాత్రోగారు పరిచయమయ్యారు. అప్పట్లో నేను జెమినీ టీవీ న్యూస్ సెక్షన్లో పని చేస్తుండేవాడిని. ఆర్థిక ఇబ్బందులతో వడపళనిలో ఉండే స్టూడియోలకు వెళ్ళి తమిళ నుంచి అనువదించే అవకాశముంటే చెప్పండంటూ తిరిగాను. అప్పుడే వెన్నలకంటిగారిని కూడా కలిశాను. అయితే ఈ సమయంలోనే మల్లికార్జున్ గారు కలవడం, ఆయన మాటగా గణేష్ పాత్రోగారింటికి వెళ్ళి పరిచయం చేసుకోగా వదిన ఎపిసోడ్స్ లో కొన్నింటిని రాసే అవకాశం ఇచ్చారు.
2006లో పొయ్ (అబద్ధం) అనే సినిమా ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం.
బాలచందర్ 2014 డిసెంబర్ 23న చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి