బాల భానుని రేఖలు
అవి దారిచూపే వెలుగులు
జ్ఞానమొసగే పసిడి రంగులు
భావితేజపు బాటలు!
పచ్చ పచ్చని తరువులు
అవి ఇచ్చుతీయని ఫలములు
అణువు అణువూ పనికివచ్చే
అద్భుతమ్మగు తనువులు!!
ఒట్టి మట్టిది భూమియే
అది గట్టి సంకల్పమ్ము తో
విత్తు విత్తుకి ఫలితమిచ్చును
సారవంతం నేలలు !!
అలలు చెలగే సంద్రము
అది దివ్యనిత్య ప్రవాహము
గర్భమందున సంపదలతో
నిరాడంబర సూత్రము !!
నిర్మలమ్ముగ ఆకసమ్
అది సాటిలేనిది రాజసం
పులుగు గుంపుల పుణ్యమిదియే
మేఘమాలల సోయగమ్ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి