ఒంటరిగా వచ్చావు....
ఒంటరిగానే వెళ్తావు....
ఏది శాశ్వతం ఈ లోకానా?
నీవు సంపాదించిన సిరిసంపదలా?
నీతో ఉన్న బంధుత్వాలా?
నీకున్న అధికారమా?
నీవు మురిసే అందమా?
కదిలి పోతుంది కదా కాలం
తరలి పోతుంది కదా యవ్వనం
చేజారి పోతుంది కదా అధికారం
జీవనమొక నీటి బుడగయే కదా!
మరుక్షణమేమి జరుగునో తెలియదు కదా!!
మరి ఎందుకు ఈ ఆరాటం?
దేనికి ఈ పోరాటం....?
నిన్ను నీవు తెలుసుకో!
గమ్యమేమిటో గమనించుకో!
శాశ్వతమయ్యెటి ధనము సంపాదించుకో!!
ఈ చరితలో నీకంటూ స్థానముండేలా....
ఏమిచ్చిందని లోకాన్ని ప్రశ్నించకు
నువ్వేమియ్యగలవో ఆలోచించు
లోపాలను సరిదిద్దుకొని...
వైఫల్యాలను అధిగమిస్తూ...
ముందుకు సాగిపోవాలి నిర్భయంగా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి