అత్రి మహర్షి ;-ఎం. వి. ఉమాదేవి
సప్త ఋషిపుంగవుల సరితూగు నత్రిముని 
అనసూయ తన పత్ని ఆదిబ్రహ్మకు సుతుడు 

తాపసుల ధర్మములు తాను తొలుతను జెప్పె 
ఋగ్వేద సూత్రాలు ఋజువుగా వ్రాసితిరి 

గూడార్ధ శ్లోకాలు గురువుగా తెలిపారు 
సీతారాములు నాడు సేవించి వెడలితిరి 

మువ్వురును పుత్రులయి మురిసిరి  త్రిమూర్తులును 
చంద్ర దుర్వాసులు జయము  దత్తాత్రేయ!!

కామెంట్‌లు