తొలగిన తెరలు...;-విష్ణు ప్రియ--కలంస్నేహం.
పొరుగింటి పుల్లకూర రుచెక్కువన్నట్టు....
ఇరుగుపొరుగు వారిని చూసి..
ఇల్లొదిలి,పల్లెనొదిలి...
పట్న వాసానికై పరుగులుపెడుతున్న యువత వైనం....

కృత్రిమ పోకడలతో...
హంగుఆర్భాటాలతో...
రణగొణధ్వనులతో...
ఎవరికివారే యమూనాతీరే అన్న చందాన...
కంటికింపుగ కనబడు రంగురంగుల ఆకాశసౌధాలతో..
అలరారే నగరంలో...
పలకరించే వారు కరువై...
ఆత్మీయత ఎక్కడా కనబడక..
మబ్బులు కమ్ముకున్న ఆకాశం అంధకారమైనట్లు...
గత జ్ఞాపకాలతో హృదయం బరువెక్కి. 
మనసున నిండిన మమతలన్ని గుర్తుకురాగా...

ఆకలి తెలియనివ్వని అమ్మ ఆప్యాయత...
సదా వెన్నంటి నిలబడే నాన్న అనురాగం...
చిలిపి సరదాలతో దోబూచులాడే వాలుజాడ వయ్యారి మరదలు...
స్నేహితులతో షికార్లు...
పచ్చని పంటలతో విలసిల్లే తన పల్లె...
కనులముందు నిలువగా...
మదిని ముసురుకున్న తెరలు తొలగి...
సరికొత్త ఉషోదయపు వెలుగులో...
తనవూరి బాటపట్టె...
నగర కాలుష్యాన్ని దాటి...
తనలాంటి వాళ్ళెందరికో మార్గం చూపుతూ..
తనవాళ్ళకై కదిలెనతడు...
తొలి వేకువ రవిలా....


కామెంట్‌లు