ఉన్నత వ్యక్తిత్వం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు మనం చదవాలి. వారు  ఏదేశంకి చెందిన వారైనా సరే!వారి నడవడి జీవిత లక్ష్యాలు అన్నికాలాలకి చెందినవే.ప్రసిద్ధ ఆంగ్ల సాహితీవేత్త జార్జి బెర్నార్డ్ షా  జీవితం లో చాలా కష్టాలు పడ్డాడు. బాల్యంలో చిరిగిన దుస్తులు చెప్పులతో స్కూల్ కి వెళ్లలేని  బీదరికం!కేవలం  5ఏళ్ళు  బడికెళ్ళాడు.కానీ 18ఏళ్ళు వచ్చేసరికి ఆంగ్లసాహిత్యంని ఔపోసన పట్టాడు.చిన్న చితకపనులు చేస్తూ 15 వ ఏటనించే అన్నికష్టాలు మోశాడు.తల్లి ఎలాగో సంసారం ఈడ్చేది.ఇతనికి మహాఆత్మాభిమానం సిగ్గు సంకోచం!కానీ మంచి చతురుడుకూడా!"నీవు ఎలక్షన్స్ లో నిలబడి ఇంగ్లాండ్ కి ప్రధానమంత్రి వి కావచ్చు "అని.దానికి అతను ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసా  ?"ప్రధాని గా ఎవరైనా నించుని ఆపదవి పొందవచ్చు. కానీ ప్రతివారూ  ఎంత ప్రయత్నించినా బెర్నార్డ్ షా కాలేరు."ఎంత ఆత్మవిశ్వాసం!ఆయనకి నోబెల్ బహుమతి కింద వచ్చిన డబ్బు మొత్తాన్ని  ఒక సంస్థ కు విరాళంగా ఇచ్చిన  త్యాగశీలి. 
రోమన్ చక్రవర్తి జూలియెస్ సీజర్ క్రీ.పూ.101లో పుట్టాడు. తాము వీనస్ దేవత వంశంవారం అని ఆదేవతవారసులం అని చెప్పుకునే వారు అతని పూర్వీకులు. సీజర్ కి ఒకసారి  తన శత్రువులు రాసిన లేఖలు కనపడితే  వాటిని చదవకుండా నే నిప్పులో పడేశాడు. అప్పుడు అతని మిత్రులు "నీవు ఆలేఖలని చదవకుండానే  అగ్గి బుగ్గి చేయటం తెలివితక్కువ పనికాదా?" అని ప్రశ్నించారు. దానికి అతను ఇచ్చిన జవాబు ఇది"ఆలేఖలని చదివితే  శత్రువుపై కోపం ద్వేషం ఇంకా పెరుగుతుంది. వారి మనోభావాలు తెలుసు కుని ఇంకా బాధపడుతూ వైరం పెంచుతూ పోతే ఏంలాభం?అందుకే సమూలంగా నాశనం చేయటం వల్ల అది పెరగదు.నిప్పులో కాలి బూడిద ఐనట్లు నాకోపం ద్వేషం  అసూయ బూడిద అయినాయి.ఈసత్యాన్ని మనం గ్రహిస్తే  జీవితంలో  శత్రువులంటూ ఎవరూ ఉండరు.నిజం కదూ?రాష్ట్రాలు దేశాల మధ్య భయాందోళనలు ఉండవు.పిల్లలలో ఈభావం పెరిగేలా పెద్దలు చూడాలి. క్లాస్ లో పిల్లలు ఏడిపించారు అని కొడుకు  ఇంటికి వచ్చి చెప్పి తే  బడికెళ్ళి విషయం కనుక్కోవాలి. ఆపిల్లల అమ్మా నాన్నల తో మాట్లాడాలి.అంతేకాని పెద్దలు  ఇరుగుపొరుగు వాదించి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేగూడదు.అదే చిలికి చిలికి గాలివాన గా మారుతుంది సుమా!
కామెంట్‌లు