నరక చతుర్దశి ఈ పండుగ విశేషం.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఆశ్వయుజ బహుళ చతుర్దశి తెల్లవారుజామున నరక భయాన్ని పోగొట్టుట కై మంగళకరంగా అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం చేయాలి. చతుర్దశినాటి నూనెలో లక్ష్మి, నీళ్లలో గంగా అ లీనమై ఉంటారు కనుక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేయాలి. ఈ స్నానం లో ఉత్తరేణి, సార, తగిరి సా ఆకులను తలపై తిప్పుకొని పారేయాలి. పిదప యమ తర్పణం చేసి నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దానం చేయాలి. ఆ దినం భోజనంలో మినప ఆకులతో కూర వండుకోవాలి. సాయంకాలం దేవాలయాల్లో మఠాల్లో దీపాలు వెలిగించాలి.
మన ఆచరించే పండుగలలో ఒక రాక్షసుని మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం నరకచతుర్దశి విశిష్టత.
నరకుని కంటే గొప్ప పరాక్రమవంతులు హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు రావణ కుంభకర్ణులు, శిశుపాల దంత వక్రలు మొదలగు వాళ్ళు. మరి వాళ్ల ఎవ్వరి మరణానికి లేని ప్రాముఖ్యం నరకానికే ఇవ్వడం, అతని మరణాన్ని ఆనంద అ పర్వదినంగా జరుపుకోవడం ఆశ్చర్యం.
ద్వాపరయుగంలో భూ భారమైన రాక్షసుడు నరకాసురుడు. అతడు తల్లి చేతిలో మాత్రమే మరణించిన ట్లు వరం ఉన్నది. అయితే భూదేవి అంశ అయిన సత్యభామతో కలిసి ఇ శ్రీకృష్ణపరమాత్మ నరకాసురుని ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజున సంహరించారు. నరకాసురునితో యుద్ధంలో శ్రీ కృష్ణ వారు మూర్చ పొందగా సత్యభామ వెంటనే యుద్ధం చేసి ఇ నరకాసురుని సంహరించింది. ఆ ఆనందంతో లోకం లోని వారందరూ దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. అందుకే దీనిని దీపావళి అనే పేరుతో పండుగ చేసుకోవడం ఆనవాయితీ అయింది. దీపావళి రోజున పూజ చేసుకోవడం విశేషం సాయంత్రం బాణాసంచా కాల్చిన తరువాత తీపి పదార్థములు తినడం ఆనవాయితీగా వస్తున్నది.
నరక చతుర్దశి దీపావళి పేరు చెప్పగానే దీపాలు వెలిగించడం బాణాసంచా కాల్చడం అందరికీ తెలిసినదే. అయితే దీపావళి నాడు తప్పనిసరిగా శరీరానికి తైలం రాసుకుని అభ్యంగన స్నానం చేయవలెను
నరకుడు పడిపోగానే ఆకాశ పనులపై దీప ఛాయతో కన్యారాశి అంటే కన్య గుంపు నరకుని బాధలనుంచి విడివడి తమను విడిపించిన సూర్యుని కృష్ణుణ్ణి నాయకునిగా అందుకే దీపావళి ముందు రోజు నరక చతుర్దశి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. కొన్ని ప్రాంతాలలో నరక చతుర్దశి రోజున నరకాసురుని బొమ్మలను తయారుచేసి ఇ వీధులన్నీ ఊరేగించి ఊరి చివర దహనం చేసి వస్తారు ఆ తరువాత నరక పీడ వదిలింది అభ్యంగన స్నానం చేస్తారు ఇది పురాణాలలోని పండుగ విశిష్టత.
కామెంట్‌లు