పిల్ల లంత వచ్చినారు
చిరతలు చేతబట్టినారు
రామచరిత మిప్పినారు
రావయ్య రామయ్య
రామాచరితమినవయ్య !!
బాలలందరు వచ్చారు
వీణ చేత పట్టినారు
వీధి వాడ తిరిగి నారు
సీత చరిత్ర చెప్పినారు
శీగ్రముగ నీవు రావయ్య
సీత కథను వినవయ్య !!
పుర జనులు వచ్చినారు
పల్లె పట్నము తిరిగి నారు
లంక చరిత విప్పినారు
రావణుని కథ చెప్పినారు
రావయ్య రామయ్య
రామాయణ గాధ వినుమయ్య !!
పిల్లలు పెద్దలు కలిశారు
పీకలు చేతపట్టి నారు
చిన్నగా మెల్లిగా ఊదారు
వానర మూకలు వచ్చాయి
వారధి గట్టి పోయాయి
లంకకు నీవు వెళ్ళవయ్య !!
రావణుని వధించి నీవు
సీతమ్మను కొని తేవయ్య
అయోధ్య పురము చేరయ్య
ప్రజల నడుమ మీకయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి