ప్రకృతే నా నెచ్చెలి;-కంకటి సవిత;-కలం స్నేహం
నిన్ను తలచుకుంటే చాలు.....
నా తనువంతా ఏదో తీయని పులకరింత....
నీతో గడిపే ప్రతీక్షణం నాకు అపురూపమే....
పట్టలేని ప్రమోదమొస్తే నీ చెంతజేరి  పంచుకోనా నీతో .... ఓ *సెల్ఫీ ప్లీజ్ యని .....

భరించలేని బాధలు నన్ను చుట్టుముట్టి ..
 మూగవోయిన నా హృదయవీణ....
ఓ మౌనరాగం ఆలపించదా....
నీ సాంగత్యమే నాకు సాంత్వనయని......

నేనీ  లోకంలోకి వచ్చిననాడే 
నాకవగతమైందిలే......
నీవే నా లోకమని..
నీలోనే భాగమై నేనున్నానని....

నా గుండె అలికిడి ఆగినా....
నన్ను నీలోనే పొదువుకొని
 ఓ గుప్పెడంత స్నేహం నీవందిస్తావని......
నా నిజమైన నెచ్చెలివి నీవేనని....

ఎత్తైన, గమ్మత్తైన ఎత్తుపల్లాలతో.....
పరవళ్లు తొక్కే సెలయేళ్ళ పరువాలతో.....
సతతహరిత శోభను సంతరించుకున్న నీ మందస్మిత వదనం  గాంచినంతనే.....
నీ నవ్వుంటే తిరణాల్లే యని అనిపించదా నా మదికి....

కాలుష్యపు కోరలలో చిక్కుకోకుండా......
పర్యావరణ హితమైన పనులు చేస్తూ.....
 జీవితమంతా కాపలానే కాస్తూ..
కంటిపాపల నిన్ను కాపాడుకుంటూ..
నీ పచ్చని ఒడిలో సేదతీరనా నా నేస్తమా...!


కామెంట్‌లు