చలాకి పిల్ల ;-సావిత్రి రవి దేశాయ్-కలం స్నేహం
పల్లవి :-
చలాకి కన్నె పిల్లా
నిన్నే నేను ప్రేమించానే 
నీతోనే లైఫు అంటూ
కలలు ఎన్నో కన్నాలే...

నీవే లేని నిన్న నాకు
ఎట్టా గడిచిందో ఏమో గాని
నీవు లేని రేపు అంతా
చీకటి మయమేగా..

ఉదయ తార వోలె నీవు
వెలుగు నింపవే, నా జీవితానికి...
సరిగమల సరాగాలతో
పదనిసల పరువాలతో
చెంత చేరవే పిల్లా.....

చలాకి కన్నె పిల్లా
నిన్నే నేను ప్రేమించానే 
నీతోనే లైఫు అంటూ
కలలు ఎన్నో కన్నాలే...

నీవే లేని నిన్న నాకు
ఎట్టా గడిచిందో ఏమో గాని
నీవు లేని రేపు అంతా
చీకటి మయమేగా..

చరణం 1 -:

ఆ మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
ఏం తెల్లగున్నావే పిల్ల… 
తేనెటీగలన్నీ చుట్టుముట్టేలా
ఏం తియ్యగున్నావే పిల్ల…
సూరీడు కూడా పొద్దు దాటినా నిన్ను చూసి పడమటి పయనం చేయడే పిల్లా...
తెల్లారి పోయినా చందమామే నీ కురుల దాగే  లాగా
ఎంతందంగా ఉన్నావే....

చలాకి కన్నె పిల్లా
నిన్నే నేను ప్రేమించానే 
నీతోనే లైఫు అంటూ
కలలు ఎన్నో కన్నాలే...

నీవే లేని నిన్న నాకు
ఎట్టా గడిచిందో ఏమో గాని
నీవు లేని రేపు అంతా
చీకటి మయమేగా..

చరణం 2 :-

ఓయ్ పిల్లా నీ చేయి అందుకొని
ఆనంద కేళిలో తేలి పోనా....
నా అడుగులలో అడుగు వేసి
జంటగ పయనం సాగిద్దామా...
మేఘమాలికల డోలికలలో ఊగుదామా...
ఎవరు లేని నవలోకానికి సాగుదామా....
కన్ను కన్ను కలిసినా,
చేయి చేయి కలిపినా
అడుగులు తడబడక నడవనా.... హొయ్

చలాకి కన్నె పిల్లా
నిన్నే నేను ప్రేమించానే 
నీతోనే లైఫు అంటూ
కలలు ఎన్నో కన్నాలే...

నీవే లేని నిన్న నాకు
ఎట్టా గడిచిందో ఏమో గాని
నీవు లేని రేపు అంతా
చీకటి మయమేగా..


కామెంట్‌లు
Savithri ravi desai చెప్పారు…
ధన్యవాదాలు
Savithri ravi desai చెప్పారు…
ధన్యవాదాలు