తెలుగు వెలుగు ; కవిమిత్ర, శంకర ప్రియ., శీల ,సంచార వాణి:- 99127 67098

 మధురమైన "తెలుగు"
మాతృభాషయే "తెనుగు"
     మనందరికీ "వెలుగు"
 వినరండి! ఆంధ్రులార!
     (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🔆అక్షరాభ్యాసము నందు.. "అ" "ఆ" లు, అక్షరాలు పలక పైన వ్రాసి; మన చిరంజీవులు చేత, బలపం (పలక పుల్ల)తో దిద్దించెదము! తరువాత, "అ"వర్ణము నుండి "క్ష"వర్ణము వరకు... "అక్షర మాల"ను వ్రాయించెదము! తరువాత, తెలుగు పదాలు, అంకెలు నేర్పించెదము!
🔆 బాలబాలికలకు చిన్నతనం నుండి... దైవ భక్తిని, దేశభక్తిని, మన సంస్కృతికి సంబంధించిన వాటిని తెలియజేయాలి! వారిని.. చదువుతో బాటు, సంస్కార వంతులుగా తీర్చి దిద్దాలి, మనమంతా! నేటి విద్యార్థులు తెలుగు "పలక" లేక పోవడానికి కారణం; "పలక" లేక పోవడమే.. ఒకకారణం! కనుక, మాతృభాష యైన "ఆంధ్ర భాష"ను ప్రేమించండి! జీవనోపాధికి "ఆంగ్ల భాష"ను అభిమానించండి!   
        🚩కంద పద్యము
🪷పలుకులు పలుకగ తెలుగున
    ఫలకమ్మున చెప్పగలుగు ప్రజ్ఞను కనగా
     పలకను కరముల నలవడ
     పలుకులు వ్రాయంగ నేర్వవలె బాలలకున్!!
        [.....డా. శాస్త్రుల రఘుపతి.,]
       ************************
🚩 ఆటవెలది పద్యములు
 🪷బాల్యమందు పలక బలపము నేర్పును
    అక్షరాలు దిద్ద లక్షణముగ 
    స్పష్టమైన రీతి పలికిరి యానాడు 
    పలకలేరు నేడు పలక లేక!
      [.... విద్వాన్ పైడి హరనాథ రావు.,]
      ***************************
🪷పలక పైన దిద్ద  పలకను బట్టరు
   వ్రాత పుస్తకముల, రాతగాని
    దిద్దినంత వెలుగు తెలుగది యిచ్చురా!
    పలుకలేరు విడచి పలక నిపుడు!
     [ డా. వేదాల గాయత్రీ దేవి.,]
        ************************
🪷పలక లేకవారు పలుకలేరు తెలుగు
   పలుకుపైని రాయ పలుకు లొచ్చు
   పలుక నేర్చుకొన్న పండితుండగు నోయి
   పలకపైని మాట పదిల మగును!
         [..గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి.,]
కామెంట్‌లు