బయటి లోకం..!!(మాటలు..ఆన్షి,రాతలుకెఎల్వీ)
 బయటికివెల్లడం
నాకెంతో ఇష్టం ,
బయటిగాలిఅంటే
చెప్పలేని అనందం !
గొప్ప గొప్ప కట్టడాలు 
అందమైనరహదారులు
దారికిఇరువైపుల
పచ్చ పచ్చని వృక్షాలు!
అందమైన బొమ్మల
దుకాణాలు...
నోరూరించే 
పండ్ల అంగళ్ళు 
రకరకాల దుస్తుల్లో 
పిల్లలు -పెద్దలు ....
ఆటోల గజిబిజి నడకలు 
వేగంగా పరిగెత్తే 
వింత వింత కార్లు ..
ఎన్ననిచెప్పను....
ఏమని చెప్పను.....
బయటకు వెల్లడం
అంతులేని ఆనందం!
అనుభవిస్తేనేతెలుస్తుంది 
అందులోని వినోదం ...!!
              ***

కామెంట్‌లు