మరో అందం;-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
 ఆ పచ్చటి పర్వతమే అరణ్యం!
వెలుగు జంధ్యం ధరించిన సూర్యుడు!!
వెన్నెల కన్నులు కలిగిన చంద్రుడు!!!
వేయి వీణల రాగాలు ఆకాశపు మేఘాలు
కరుగుతున్న కొవ్వొత్తులు
అగరొత్తుల పరిమళాలు మోసుకెళ్తున్న
పిల్లగాలి పిల్లనగ్రోవి లో దూరింది!?

నెమలి కన్నుల మీనాలు
కదులుతున్న కలలు సముద్రపు అలలు
నీలమేఘశ్యాముడీ నిదురలో 
దూరు తున్నవీ!?
నిన్నటి రాత్రి ని నేటి చరిత్ర ను
కన్నీటిని నీటి శిల్పాలుగా చెక్కుతున్న కాలం
కవి గా కాదు శిల్పి గానే మిగిలిపోతానంటూ
శతాబ్దాల రాతియుగం లోకి చేరి పోయింది!

ఎదిరి చూస్తున్న ఆకాశం
వేచి ఉన్న అవకాశం నిరీక్షిస్తున్న నిజం
కనురెప్పల కదలికల్లో నడుస్తున్న
సూపుల అందం లో కలిసి పోయింది!?
విరిసిన పూలు కురిసిన చినుకులు
కదులుతున్న పంటచేలు
రాత్రి పగలు ఎవరికోసమో అర్థం కాదు
ధరిత్రి నేత్రం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం!?
పచ్చని ప్రకృతి
నదీ ఆకాశం అందం ముందు
ఏది అంత అందం
మనిషి సృష్టించిన
మరో అందం ఆమె!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 
8309529273

కామెంట్‌లు