సద్గతి--ఎం.ఎ.ఉమారాణి--కలంస్నేహం
జీవితం శాశ్వతము కాదెపుడు
ప్రపంచమొక రంగులరాట్నమెపుడు
సాహసం సంతోషాన్నివ్వదెపుడు
పయనం సాఫీగా సాగదెపుడు
స్వర్గం ఊరికే లభించదెపుడు

ఉన్నన్నాళ్ళు వృక్షాల్లా ఉపకారం చేయాలి
చేసినన్నాళ్ళు పాలునీళ్ళలా కలిసిపోవాలి
బ్రతికినన్నాళ్ళు సూర్యచంద్రుల్లా వెలగాలి
ఓపికున్నన్నినాళ్ళు ప్రజాసేవ చేస్తుండాలి
చేతనైన్నాళ్ళు పరులకోసమే బ్రతకాలి

మానవలకందరికి సద్బుద్ధులుండాలి
కష్టసుఖాలను ఆస్వాదించే గుణముండాలి
బ్రతుకుపోరాటంలో నెగ్గేఉపాయముండాలి
సరైన దిశకు వెళ్ళగలిగే ధైర్యముండాలి
తుఫానులనెదుర్కొనే ధీశక్తి ఉండాలి
కర్తవ్యాన్ని పాలించే గొప్ప మనసుండాలి

అన్నీ ఉంటేనే అదృష్టం వరిస్తుంది
మంచిమనస్సుంటేనే పుణ్యం లభిస్తుంది
సమానత్వభావముంటేనే సంతృప్తి వస్తుంది
సముచితమార్గమే సౌఖ్యం  కలుగుతుంది
నిస్వార్ధపరుడవైతేనే సద్గతి ప్రాప్తిస్తుంది.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
కవిత ప్రచురించినందులకు ధన్యవాదములు