కిటుకులు - కథానిక ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 జీతూ వాళ్ళ ఇంట్లో చాలా గారాబంగా పెరిగాడు.ముగ్గురిలో  చిన్నవాడు కావడంతో అడిగినవన్నీ ఇచ్చి కొంచెం చెడగొట్టారు పెద్దవాళ్ళు. హై స్కూల్ కి వచ్చేసరికి ఇంకో కొత్త దుబారా మొదలెట్టాడు జీతూ. 
ఎక్కడైనా పుస్తకాలు కోసమో, కొత్త  వస్తువుల కోసమో డబ్బులు పంపండి అని ప్రకటన ఉంటే గుడ్డిగా నమ్మి పంపమని తండ్రిని ఒత్తిడి చేయడం. ఎక్కువగా మోసపోవడం. వాడికి ఎంత చెప్పినా వినకుండా ఉంటే, తండ్రి షరతులు పెట్టాడు. ఇలాంటివి కావాలంటే పుట్టినరోజున కొత్తబట్టలు  క్యాన్సిల్ అని. అన్నిటికీ ఒప్పుకునే వాడు జీతూ. ఒకరోజు పత్రికలో ప్రకటన చూసాడు. వంటగదిలో పురుగులు, బొద్దింకలూ రాకుండా పురుగుమందులు లేకుండా ఒక కిటుకు ఆయుధం పంపుతాము ఫలానా అడ్రెస్ కు వంద రూపాయలు పంపండి అని చూసాడు. వెంటనే ఆసక్తితో పంపాడు. వారం రోజులకి పోస్ట్ లో చిన్నఅట్ఠ  పెట్టె వచ్చింది. విప్పి చూస్తే, రెండు టైల్స్ ముక్కలున్నాయి. 
ఒక పేపర్ లో ఇలా ఉంది. 
ఆ పురుగులని పట్టుకొని ఈ టైల్స్ మధ్య పెట్టి అదిమితే చచ్చిపోతాయి. అని.. దెబ్బ తో 
ఆందరూ నవ్వి జీతూ ని బాగా వెక్కిరిస్తూ ఉన్నారు. దెబ్బ తో ఆ అలవాటు వదిలేసాడు జీతూ!!
  (సమాప్తం )
నీతి - ఆసక్తి పేరుతో డబ్బులు వృధా చెయ్యరాదు. 

కామెంట్‌లు