కాపాడుదాం అనంత విశ్వాన్ని..;-విష్ణు ప్రియ- కలం స్నేహం .
శ్వేత వర్ణపు సొగసులద్దుకొని..
ఒంపుసొంపుల మేనితో...
హంగు పొంగుల వయ్యారాలతో...
దూదిపింజాల్లా తేలిపోతూ...
నీలిగగనాన్ని అందుకోవాలన్న ఆరాటంతో...
చల్లచల్లని హిమవత్పర్వతాలతో...
ధగధగ మెరిసిపోతున్న మంచుఖండమది....

నేడు....
అధిక ఉష్ణోగ్రతలతో....
భూతాపం పెరిగి....
మంచు కరిగి నీరై ప్రవహిస్తూ..
సాగర జలాలు భూమిని అక్రమిస్తున్న వేళ...
హిమ దుప్పటి కప్పుకున్న సంద్రాలెన్నో నేడు...
మానవుడు వదిలే కర్బన 
ఉద్గారాలకు...
చెడు వాయువును వెదజల్లుతూ....
ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తున్న వేళ....

వాయువుల వేడికి అడవులను కార్చిచ్చు దహించివేయగా...
తానే ఛత్రమై మనను రక్షించే ఓజోన్ పొర....
అంతరిస్తున్నవేళ...
ఎన్నెన్నో అంతుచిక్కని వ్యాధులు ప్రబలి కబళిస్తున్నవేళ...

జలప్రళయం ముంచుకొచ్చి
మనని ముంచకముందే....
కాపాడుకుందాం ప్రకృతిని...
వాహనాలు నిలిపేసి నడక నేర్చుకుందాం...
పచ్చని మొక్కలు నాటి అడవులను ...
అనంతమైన విశ్వాన్ని కాపాడుకుందాం అందరం కలిసి.....


కామెంట్‌లు