నీ నవ్వే కొత్తగా..;-విజయ రామగిరి-కలంస్నేహం
నవ్వింది నా ఎంకి నాగమల్లిలా..
నాకోసమే పూచే రోజా బాలలా..
నన్నే మైమరిపించే సుకుమార జాజిమొగ్గలా..
నెలరాజును కవ్వించే కలువపూవులా....

నిశ్శబ్దపు రాతిరిలో వెలిగే చిరు దివ్వెలా...
నా వంకే చూసింది నిండు చందమామలా...
నా జీవన నౌకలో విరిసింది పున్నమి వెన్నెలలా...
నువ్వే వస్తావు ప్రతి ఉదయంలా...

నీ పిలుపే నాలోన రవళించే సన్నాయిలా...
నాట్యమాడుతోంది మనసే మయూరిలా..
నగము నుంచి జాలువారు సుందర ఝరిలా..
నందనవనమై విరిసిందే ఎద బృందావనిలా...
నిన్నే కొలువుంచా నా దేవతలా..
నిశ్చలమైన మనస్సుతో ఆరాధించా ప్రేమికునిలా..

నిన్నే శ్వాసించా నా ప్రాణంలా...
నీడలా తోడుంటా అన్ని వేళలా..
నేనే మారానులే నా నువ్వులా ...
నిదురలో కలగంటాను నిన్నే ఇలా..
నీ ధ్యాసలో మరిచాను నన్నే ఎలా...
నిన్నిలా చూస్తూ గడిపేస్తా ఎన్ని యుగాలైనా..
నీకోసమే ఉంటాను ఎన్ని జన్మలైనా...


కామెంట్‌లు