పల్లెటూరి పిల్లోడు సైతం
ఎన్నికలంటే ....
అదోపండుగ అనుకుని
ఎగిరి గంతేస్తున్నాడు...
పెద్దోళ్ళు మాత్రం,
నిజంగానే--
పండగజేసుకున్టున్నారు!
చేసుకోరూమరి....
బీదరికానికి
అందని ద్రాక్షపండు
బిర్యాని
ఇంటికే వస్తున్నది ...
చేతికందిన సొమ్ముతో
నేలగ్రాసం
గడిచిపోతున్నది ....!
ఎవడుగెలిస్తే
వాడికెందుకు ?
దేశం ఏమైపోతే
వాడికెందుకు ...?
నడిచినంతకాలం
నడిపిస్తాడు ....
కష్టమంటే ఏమిటో
మరిచిపోతాడు ....
నూకలు రాసుంటే
బ్రతికి బట్టకడతాడు
లేకుంటే ....
కాలగర్బంలో
కలిసిపోతాడు .....!
ఆ..ఇంట్లో మాత్రం,
వెన్నెముకలేని-
అమ్ముడుపోయే
ఓటరుమరొకడు
ఎంగిలికూడు కోసం
ఎదురుచూస్తున్టాడు !!
***
ఎంగిలికూడు ...!! కవిత ;-డా.కె.ఎల్.వి.ప్రసాద్.>హన్మకొండ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి